Wednesday, 29 August 2007

హిరణ్యకశ్యపుడి తో ప్రహ్లాదుడి మాటలు

అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై
చచ్చుచు బుట్టుచున్ మఱల జర్విత చర్వణులైన వారికిం
జెచ్చెర బుట్టునే పరులు సెప్పిన నైన నిజేచ్ఛనైననే
మెచ్చిన నైన గనలకు నేగిననైన హరిప్రభోధముల్

శోధించపంబడె సర్వశాస్త్రములు రక్షోనాథ వెయ్యేటికిన్
గాథల్ మాధవ శేముషీ తరణి సాంగత్యంబునంగాకదు
ర్మేధం దాటగ వచ్చునే సౌత వధూ మనోగ్రవాంఛామద
క్రోధోల్లోల విశాలసంసృతి మహా గోరామితితాంభోనిధిన్

కాననివాని నూతగొని కాననివాడు విశిష్టవస్తువుల్
గాననిభంగి గర్మములు గైకొని కొందఱు కర్మబుద్ధులై
కానరు విష్ణు గొంద ఱట గందు రకొంచిన వైష్ణవాంఘ్రి సం
స్థాన రజో భిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా

0 comments: